చాగలమర్రిలో కుండపోత వర్షం
ABN , Publish Date - Sep 26 , 2024 | 01:06 AM
చాగలమర్రి మండలంలో బుధవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది.
చాగలమర్రి, సెప్టెంబరు 25: చాగలమర్రి మండలంలో బుధవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. 18.6 మీ.మీ వర్షపాతం నమోదైంది. మెట్ట పొలాల్లో సాగు చేసిన కంది, పత్తి, మినుము, మొక్కజొన్న, ఉల్లి పంటలకు జీవం పోసింది. చాగలమర్రి గ్రామ సమీపంలోని అడ్డవాగు పొంగి ప్రవ హించడంతో రాకపోకలు స్తంభించాయి. తెలుగుగంగ ప్రధాన కాలువలో వచ్చే లీకేజీ నీరు, వరద నీరు కలిసి ప్రవహించడంతో వంక ప్రవాహం అధి కమైంది. వాగులు, వంకలు వర్షపు నీటితో జలకళ సంత రిం చుకున్నాయి. గొడిగనూరు, శెట్టివీడు, ముత్యాలపాడు, చాగలమర్రి, పెద్దబో దనం సర్వీసు రహదారుల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న ధాన్యం తడిచి దెబ్బతింది.