Share News

వాజ్‌పేయికి ఘన నివాళి

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:39 AM

కల్లూరు బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ్‌ పేయి శత జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

వాజ్‌పేయికి ఘన నివాళి
వాజ్‌పేయి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు

కర్నూలు ఎడ్యుకేషన, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కల్లూరు బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ్‌ పేయి శత జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీఎస్‌ నాగరాజు, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి రిటైర్డు ప్రిన్సిపాల్‌ డా.కొట్టె చెన్న య్యలు హాజరై వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాజ్‌పేయి వ్యక్తిగతం, నిజాయితీ, నిబద్దత గురించి పార్టీకి, దేశానికి చేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో పాణ్యం బీజేపీ కన్వీనర్‌ రామమద్దిలేటి, రామో హన రెడ్డి, దిలీఫ్‌ వర్మ, రమణ యాదవ్‌, మహేంద్ర, సురేష్‌, మోహ నరావు, రామకృష్ణ, భాస్కర్‌, మహేష్‌ పాల్గొన్నారు.

కర్నూలు కల్చరల్‌: భారత మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి ఆదర్శ నేత అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరూరు రాఘవేంద్ర అన్నారు. బుధవారం వాజ్‌పేయి జయంతి సందర్భంగా 46వ వార్డు నర సింహా రెడ్డి నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ దేశ ప్రధానిగా అందరికీ సుపరిపాలన అందించిన ఘనత వాజ్‌పేయికి దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లోకేశ్వరయ్య, రామాంజినేయులు, శివయ్య శెట్టి, శ్రీనివా సులు, మహేష్‌, పర్ల శివ, ఆయూబ్‌ఖాన, జావీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:39 AM