ఇద్దరు దొంగల అరెస్టు
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:50 AM
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారు, టీవీ, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హనుమంత నాయక్ తెలిపారు.
బంగారు, టీవీ, నగదు స్వాధీనం
కోవెలకుంట్ల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారు, టీవీ, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హనుమంత నాయక్ తెలిపారు. శనివారం కోవెలకుంట్ల పట్టణంలోని సర్కిల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచారు. కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన శ్రీరాముల విజయభాస్కర్, మౌలాలి అనే ఇద్దరు వ్యక్తులు కంపమల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో దొంగతనాలు చేశారు. పొలం పనులకు వెళ్లిన వాళ్ల ఇండ్ల తాళాలు పగలగొట్టి బంగా రు, టీవీ, నగదు ఎత్తుకెళ్లా రు. ఇలా గ్రామంలోని నా లుగు ఇళ్లల్లో దొంగతనాలు చేశారు. దొర్నిపాడు మం డలం క్రిష్టిపాడు గ్రామంలో కూడా రెండిళ్లలో దొంగతనాలు చేసి కొంత నగదు ఎత్తుకెళ్లారు. సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి నేతృత్వంలో పోలీసులు శ్రీరాముల విజయభాస్కర్, మౌలాలను అదుపు లోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారి నుంచి 3.5 తులాల బంగారం, 65 వేల నగదు, ఐదు జతల వెండి పట్టీలు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు విలేఖరుల సమావేశంలో తెలిపారు. వీరిని మేజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.