Share News

ఉత్తమ సేవలకు ఉపాధ్యాయ రత్న అవార్డు

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:17 PM

గిరిజన విద్యార్థులకు చదువు చెప్పడంలో అంకిత భావం ప్రదర్శించినందుకు అద్దంకి చంద్రమోహన్‌కు ఉపాధ్యాయ రత్న అవార్డును ప్రకటించారు.

ఉత్తమ సేవలకు ఉపాధ్యాయ రత్న అవార్డు
అవార్డు తీసుకుంటున్న అద్దంకి చంద్రమోహన్‌

తుగ్గలి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులకు చదువు చెప్పడంలో అంకిత భావం ప్రదర్శించినందుకు అద్దంకి చంద్రమోహన్‌కు ఉపాధ్యాయ రత్న అవార్డును ప్రకటించారు. మండలంలోని లక్ష్మీతాండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అద్దంకి చంద్రమోహన్‌ హైదరాబాదులో ఆల్‌ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ అందించిన ఉపాధ్యాయ రత్న అవార్డును హైకోర్టు జడ్జి జస్టిస్‌ చంద్రయ్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ రత్న పురస్కారం అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. అవార్డు అందుకున్న చంద్రమోహన్‌ను ఎంపీపీ ఎర్రనాగప్పతో పాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

Updated Date - Dec 19 , 2024 | 11:17 PM