Share News

‘వైసీపీ హయాంలోనే యురేనియం అనుమతులు’

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:37 PM

గత వైసీపీ ప్రభుత్వం యురేనియం తవ్వకాల కోసం సర్పంచుల తీర్మానాలతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

‘వైసీపీ హయాంలోనే యురేనియం అనుమతులు’
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం యురేనియం తవ్వకాల కోసం సర్పంచుల తీర్మానాలతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్పొరేషన్‌ చైర్మన్ల్లు బొజ్జమ్మ, దేవేంద్రప్పతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ యురేనియంపై కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దేవనకొండ మండలంలో బంగారు గనులసర్వే పేరుతో 2019లో వైసీపీ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ఓటమి పాలైన తర్వాత వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డైరెక్టర్‌ నంద్యాల నాగేంద్ర, జేమ్స్‌, పోతురాజు రవి, చంద్రకాంత్‌, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:37 PM