Share News

గర్భాశయ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:49 AM

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ రాకుండా మహిళలకు ప్రభుత్వం ఇమ్యూనైజేషన్‌ తరహాలో హ్యూమన్‌ పాపిలోమా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు జాతీయ గైనిక్‌ సొసైటీ కార్యదర్శి డా. మాధురీ పటేల్‌ అన్నారు.

గర్భాశయ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌
సదస్సును ప్రారంభిస్తున్న వైద్యులు

త్వరలో ఇమ్యూనైజేషన్‌ తరహా వ్యాక్సిన్‌

తల్లుల మరణాల నివారణకు కృషి చేయాలి

కర్నూలులో ప్రారంభమైన జాతీయ గైనిక్‌ వైద్యుల సదస్సు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ రాకుండా మహిళలకు ప్రభుత్వం ఇమ్యూనైజేషన్‌ తరహాలో హ్యూమన్‌ పాపిలోమా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు జాతీయ గైనిక్‌ సొసైటీ కార్యదర్శి డా. మాధురీ పటేల్‌ అన్నారు. శనివారం రాత్రి మౌర్యఇన్‌ హోటల్‌లో జాతీయ గైనిక్‌ వైద్యుల సదస్సును ప్రిన్సిపాల్‌ డా. చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు, అనంతపురం మెడికల్‌ కాలేజీ ప్రిన్పిపాల్‌ డా. మాణిక్యరావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డా.షర్మిళ అయ్యావు, ఆర్గనైజింగ్‌ చైర్‌పర్సన్‌ డా.ఎస్‌. వెంకటరమణ, సెక్రటరీ డా. రాధాలక్ష్మి, గైనిక్‌ హెచ్‌వోడీ డా. శ్రీలక్ష్మితో ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. డా. మాధురీపటేల్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశంలో సర్వేకల్‌ క్యాన్సర్‌తో అధిక సంఖ్యలో మహిళలు మరణిస్తున్నారని, అందువల్ల 9 నుంచి 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ పిల్లలు, మహిళలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తీసుకోవాలన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టి నరసమ్మ, కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు జాతీయ గైనిక్‌ వైద్యుల సదస్సు జరగడం అభినందనీయమని అన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:49 AM