Share News

వేదవతి, నగరడోణపూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:13 AM

సాగు, తాగు నీటి సమస్య పరిష్కారానికి వేదవతి, నగరడోణ ప్రాజెక్టులు పూర్తి చేయాలని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ సీఎంకు విన్నవించారు.

వేదవతి, నగరడోణపూర్తి చేయాలి
సీఎంకు వినతిపత్రం ఇస్తున్న వీరభద్ర గౌడ్‌

సీఎంకు ఆలూరు ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ వినతి

ఆలూరు, అక్టోబరు 1: సాగు, తాగు నీటి సమస్య పరిష్కారానికి వేదవతి, నగరడోణ ప్రాజెక్టులు పూర్తి చేయాలని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ సీఎంకు విన్నవించారు. మంగళవారం పత్తికొండలో సీఎంను కలిశారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు వైకుంఠం జ్యోతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కపట్రాళ్ళ బుజ్జమ్మ, రామచంద్ర నాయుడు, మాజీ ఎడ్పీటీసీ మీనాక్షి నాయుడు, టీడీపీ నేతలు వెంకటేష్‌ చౌదరి, విష్ణువర్ధన్‌ రెడ్డి సీఎంకు పుష్ప గుచ్చం అందించారు.

సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యం

ఆలూరు రూరల్‌: సంక్షేమ పాలన సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని వీరభద్ర గౌడ్‌ అన్నారు. హులేబీడు గ్రామంలో మంగళవారం ఉదయం పింఛన్లను పంపిణీ చేశారు. దీపావళి కానుకగా ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. 16,437 పోస్టులతో మెగా డీఎస్పీ నోటిఫికెషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కన్వీనర్‌ అశోక్‌ యాదవ్‌, ఎంపీడీవో అల్లాబకాష్‌, టీడీపీ సినియర్‌ నాయకులు హులేబీడు కేశన, బాలరాజు, వెంకటేశ్వరులు, రాము యాదవ్‌, వన్నూర వలి, ఈరన్న, కుపేంద్ర మూర్తి, సోమలింగ, గిరెప్ప పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:13 AM