Share News

ఎయిర్‌పోర్టుకు పల్లెవెలుగు!

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:38 PM

ఓర్వకల్లులోని కర్నూలు విమా నాశ్రయానికి ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు సర్వీసును బుధవారం నుంచి ప్రారంభించారు.

ఎయిర్‌పోర్టుకు పల్లెవెలుగు!
ఎయిర్‌పోర్టు ఎదుట ఆర్టీసీ బస్సు

ఓర్వకల్లు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లులోని కర్నూలు విమా నాశ్రయానికి ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు సర్వీసును బుధవారం నుంచి ప్రారంభించారు. షెడ్యూల్‌ ప్రకారం మొదటి సర్వీసు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఉదయం 8:45కు ప్రారంభమై 9:30 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరి 12:45 గంటలకు కర్నూలు బస్టాండుకు, అలాగే కర్నూలు బస్టాండు నుంచి 1.15 కు బయల్దేరి 2 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టుకు చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 4:45 గంటలకు కర్నూలు బస్టాండుకు చేరుకుంది. ఇదిలా ఉండగా టికెట్‌ ధర్‌ రూ.30గా నిర్ణయించినట్లు కర్నూలు డిపో-1 మేనేజర్‌ సుధారాణి వెల్లడించారు. జిల్లా వాసులు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Updated Date - Nov 20 , 2024 | 11:38 PM