ప్రతి వారం గ్రామాలను సందర్శించాలి: కలెక్టర్
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:32 AM
వచ్చే వారం నుంచి స్పెషల్ ఆఫీసర్లంతా ప్రతి వారం వారికి కేటాయించిన మండలంలో ఓ గ్రామంలోని పాఠశాల, అంగనవాడీ కేంద్రం, వసతి గృహం, సచివాలయం, పీహెచసీలను సందర్శించి నిర్దేశించిన ప్రొఫార్మాలో తనిఖీ నివేదికలను పంపాలని కలెక్టర్ పి.రంజిత బాషా అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వచ్చే వారం నుంచి స్పెషల్ ఆఫీసర్లంతా ప్రతి వారం వారికి కేటాయించిన మండలంలో ఓ గ్రామంలోని పాఠశాల, అంగనవాడీ కేంద్రం, వసతి గృహం, సచివాలయం, పీహెచసీలను సందర్శించి నిర్దేశించిన ప్రొఫార్మాలో తనిఖీ నివేదికలను పంపాలని కలెక్టర్ పి.రంజిత బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ భవనంలో వంద రోజుల లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జనవరి 2025 నుంచి మార్చి వరకు రూపొందించనున్న మూడో వంద రోజుల ప్రణాళికలో కేవలం మంజూరు, గ్రౌండింగ్‌పైనే కాకుండా పనులు పూర్తి చేసే విదంగా లక్ష్యాలను నిర్ధేశించుకోవాలన్నారు. జిల్లాలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన కార్యాచరణ ప్రణా ళికను రూపొం దించి సమర్పించాలని జడ్పీ సీఈవో, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఈలను ఆదేశించారు. సివిల్ సప్లయిస్‌కి సంబంధించి ఎఫ్‌పీ షాపులకు సంబంధించిన నోటిఫి కేషన విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతుందని డీఎస్‌వోను ప్రశ్నిం చారు. పంచాయతీరాజ్ సీసీ రోడ్లకు సంబంధించి 830 పనులకు గానూ 581 పూర్తయ్యాయని, మిగిలిన పనులకు సంక్రాం తిలోపు పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఇన్సిట్యూషనల్ ప్లాంటేషన (సంస్థాగత తోటల పెంపకం) పనులు, బ్లాక్ ప్లాంటేషన పనులను వేగవంతం చేయాలన్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, ఆదోని మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీ లేద లోకల్ ఫండ్స్ ద్వారా మున్సిపల్ రోడ్లు ప్యాచవర్కు పనులు చేయించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కోర్టు కేసులు స్టేజ్ వారీగా అప్‌డేట్‌గా ఉండాలని, కేసులకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అన్నారు. సమావేశంలో డీఆర్వో సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.