ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:11 AM
ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని, పుచ్చకాయలమడను ఆదర్శంగా తీర్చి దిద్దుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
గ్రామాభివృద్ధికి రూ2.88 కోట్లు మంజూరు చేస్తున్నాం
ఆర్థిక సాధికారిత సాధించాలి
ప్రజావేదికలో సీఎం చంద్రబాబు
పత్తికొండ/ పత్తికొండ టౌన్ అక్టోబరు 1 : ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని, పుచ్చకాయలమడను ఆదర్శంగా తీర్చి దిద్దుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళ వారం మండలంలోని పుచ్చకాలయమడ గ్రామంలో సీఎం పర్యటించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.20 గంటలకు గ్రామానికి చేరుకున్నా రు. గ్రామంలో తలారి గంగమ్మ, చింతగింజల వెంకటేశ్వర్లు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ హరిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా వేదిక గ్రామసభలో మాట్లాడారు. వర్షాధారంపై ఆధారపడ్డ పుచ్చకాలయమడ గ్రామ రైతుల కోసం హంద్రీ- నీవా ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు. గ్రామంలో అభివృద్ధ్ధి పనులకు ప్రతిపా దనలు ఇచ్చారని రూ.2.88 కోట్లను ఈ వేదికపైనే మంజూ రు చేస్తున్నామని అన్నారు. సీసీ రహదారులు, పాఠశాల, శ్మశానం ప్రహరీ నిర్మాణాలు ఉన్నాయన్నారు. గ్రామం నుంచి మద్దికెర, హోసూరు, పత్తికొండకు బీటీ రహదారులు కావాలన్నారని, భవిష్యత్తులో కేటాయిస్తామన్నారు. గ్రామ స్థులు ప్రభుత్వమిచ్చే పథకాలతో సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, చేతివృత్తుల ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కోరారు.
గన్‌మెన్లు ఇవ్వాలని కోరిన నాగేంద్ర
ఫ్యాక్షన్ నేపథ్యం కారణంగా తనకు గన్‌మెన్ల కేటాయించాల ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర సీఎం చంద్రబాబునాయుడిని కోరారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి నాగేంద్రకు వెంటనే గన్‌మెన్లను కేటాయించాలని పక్కనే ఉన్న సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు, వరలక్ష్మి, గుడిసె కృష్ణమ్మ, తిమ్మయ్య చౌదరి, వెంకటపతి ఈశ్వరప్ప, బత్తిన లోకనాథ్, శ్రీధర్‌రెడ్డి, అడ్వకేట్ సురేష్ కుమార్, ఎంపీటీసీ చంద్ర, వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ చౌదరి పాల్గొన్నారు.
సీఎం సభలో తోపులాట..
సీఎం సభలో తోపులాట చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. హెలిప్యాడ్ నుంచి నేరుగా పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి అనంతరం సభా వేదికకు చేరుకున్నారు. సభముగించుకుని వెళుతున్న సమ యంలో సీఎం వద్దకు దూసుకెళ్లడానికి కొందరు ప్రయ త్నించారు. తోపులాటకు కారణమైన ఇద్దరు యువకులను పోలీసులు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.