Share News

వైభవంగా పద్మనాభతీర్థుల పూర్వారాధన

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:19 AM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురువులైన పద్మనాభతీర్థుల పూర్వారాధన మహోత్స వాలు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా పద్మనాభతీర్థుల పూర్వారాధన
పద్మనాభతీర్థుల బృందావనానికి పూజలు చేస్తున్న ఉభయ పీఠాధిపతులు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

వాధిరాజమఠం పీఠాధిపతికి ఘన సన్మానం

మంత్రాలయం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురువులైన పద్మనాభతీర్థుల పూర్వారాధన మహోత్స వాలు వైభవంగా నిర్వహించారు. తుంగభద్ర నది ఒడ్డున వెలసిన నవబృందావనంలోని పద్మనాభతీర్థుల మూల బృందావనానికి శుక్రవారం వాధిరాజమఠం పీఠాధిపతి విశ్వవల్లభతీర్థులు, మంత్రాలయం రాఘవేం ద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సంయుక్తంగా విశేషంగా క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు చేసి అక్కడే సంస్థాన పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. ఉభయ పీఠాధిపతులు భక్తు లకు శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ప్రకాషాచార్‌, ద్వారపాలక అనంతస్వామి, పవనాచార్‌, శ్రీహరిచార్‌, సంజీవ కులకర్ణి, వాధిరాజాచార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:19 AM