Share News

ప్రజలను మోసం చేశారు

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:02 AM

విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ భారం మోపి మోసం చేశారని మాజీ ఎమ్మేల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, ఎమ్మేల్సీ మధుసూదన్‌ ఆరోపించారు.

ప్రజలను మోసం చేశారు
ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల బైక్‌ ర్యాలీ

ఆదోని, ఆలూరు, పత్తికొండలో వైసీపీ నాయకుల నిరసన

ఆదోని, డిసెంబరు27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ భారం మోపి మోసం చేశారని మాజీ ఎమ్మేల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, ఎమ్మేల్సీ మధుసూదన్‌ ఆరోపించారు. శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి విద్యుత్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఈఈ హరి, ఏడీఈ పురుషోత్తంకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్‌ రెడ్డి, శేషిరెడ్డి, రామలింగేశ్వర యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహులు, మహిళా నాయకురాలు శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.

విద్యుత్‌ చార్జీల పెంపు అన్యాయం

ఆలూరు: విద్యుత్‌ చార్జీల పెంపు అన్యాయని కూటమి ప్రభుత్వం మాట తప్పిందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ కృష్ణ మోహన్‌ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో లాంతర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, డీఈఈ సంతోష్‌ కుమార్‌కు వినతిపత్రం అందించారు. దేవనకొండ జడ్పీటీసీ కిట్టు, చిప్పగిరి మండల కన్వీనర్‌ మారయ్య, వైసీపీ నాయకులు శేషప్ప, మధుసూదన్‌ రెడ్డి, జటప్ప గారి వీరేశ్‌, వెంకటేశ్వరులు, భాస్కర్‌, వీరేష్‌, గిరి, వరుణ్‌, రాజు, శేఖర్‌ షఫీవుల్ల పాల్గొన్నారు.

సంపద సృష్టించడమంటే భారం మోపడమా?

పత్తికొండ టౌన్‌: సంపద సృష్టించడమంటే పేదలపై భారం మోపడమా అని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి నాలుగు స్థంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండుసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి ప్రజలపై రూ.15వేల కోట్లు పెనుభారం మోపిందని ఆరోపించారు. అనంతరం విద్యుత్‌ అదికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎంపీపీలు నారాయణదాసు, వెంకట్రామిరెడ్డి, జడ్పీటీసీ మురళిధర్‌ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్లు నాగరాజు, గిత్తా నాగేష్‌, వెంకట్రాముడు, మాజీ సర్పంచ్‌ సోమశేఖర్‌, గాంధీరెడ్డి, బాబుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ధర్నాకు ఆ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, అనుచరులు పాల్గొనలేదు.

Updated Date - Dec 28 , 2024 | 12:02 AM