Share News

Kurnool: విజేతగా నిలవాలనుకున్నాడు.. కానీ మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు..

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:12 PM

వంశపారం పర్యంగా తన పూర్వీకుల ఆచార సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లాలనే లక్ష్యమే అతడిని మృత్యు ఒడిలోకి నెట్టింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి.. అతడిని కర్నూలు నగరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

Kurnool: విజేతగా నిలవాలనుకున్నాడు.. కానీ మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు..

వంశపారం పర్యంగా తన పూర్వీకుల ఆచార సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లాలనే లక్ష్యమే అతడిని మృత్యు ఒడిలోకి నెట్టింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి.. అతడిని కర్నూలు నగరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.


దసరా పర్వదినం పురస్కరించుకుని ప్రతి ఏటా గుర్రాల పారువేటను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అందులో పాల్గొని విజేతగా నిలవాలని పృథ్వీరాజ్ రాయుడు చాలా కాలంగా అనుకుంటున్నాడు. ఆ క్రమంలో గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు. అందులోభాగంగా బీఎన్ పేట గుర్రంపై వెళ్లి.. తిరిగి మద్దికేరకు తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో కాస్తా వేగంగా గుర్రం స్వారీ చేస్తుండంతోపాటు కొద్ది పాటి ఏమరపాటుగా వ్యవహరించాడీ రాయుడు. దీంతో రహదారిపై అతడు కింద పడిపోయాడు.


గుర్రం మాత్రం తన మానాన తాను ముందుకు దౌడు తీస్తు వెళ్లిపోతుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. అతడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో రాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. పృథ్వీరాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పృథ్వీరాజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందజేశారు.


రాజుల కాలం నాటి నుంచి మద్దికేరలో చిన్న నగరి, పెద్ద నగరి వంశస్తుల మధ్య గుర్రపు స్వారీ ఆట కొనసాగుతూ వస్తుంది. అందులోభాగంగా బొజ్జనాయన పేట నుంచి మద్దికేర వరకు ప్రతి ఏడాది దసరా పండగ వేళ.. ఈ గుర్రాల పారవేటను నిర్వహిస్తారు. ఎవరైతే గుర్రం మీద భోజనానిపేట గ్రామం మీదుగా మద్దికేర గ్రామంలోకి ముందుగా తిరిగి వస్తారో వారే విజేతగా నిలుస్తారు.


ఈ గుర్రపు స్వారీలో విజేతగా నిలిచిన వారిని అనంతరం గ్రామంలో ఊరేగించి అభినందిస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార సంప్రదాయం. ఈ ఆటో గెలవాలనే లక్ష్యంతో మద్దికెర వాసి పృథ్వీరాజ్.. గుర్రపు స్వారీ చేయడంలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని నగరి వంశస్తులకు ఆ యా పరిసర గ్రామాల ప్రజలు వారికి ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 04:12 PM