6, 7 తేదీల్లో అల్పపీడనం
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:25 AM
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు,
దక్షిణ కోస్తా, రాయలసీమలకు వర్షసూచన
రెండో వారంలో మరో అల్పపీడనం
విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇదికాకుండా ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు శనివారం సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి
RK Kothaapluku : మరీ ఇంత నీచమా?