Share News

Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:22 PM

ముంబై హీరోయిన్ కాదంబరి జిత్వానీకి వైసీపీ చిత్రహింసలు వ్యవహారంలో వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టిన నేపథ్యంలో కింద స్థాయి అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ ఇంటెలిజెన్స్ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని బయటపెట్టారు. దీంతో ఆంజనేయులు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.

Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు

అమరావతి: ముంబై హీరోయిన్ కాదంబరి జిత్వానీకి వైసీపీ చిత్రహింసలు వ్యవహారంలో వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టిన నేపథ్యంలో కింద స్థాయి అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ ఇంటెలిజెన్స్ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని బయటపెట్టారు. దీంతో ఆంజనేయులు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.


తాము ఆయన చెబితేనే చేశామని కింద స్థాయి అధికారులు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది పోలీస్ అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగానే అధికారులు కేసు కూపీ లాగుతున్నారు. అయితే వచ్చి ఆ మేరకు స్టేట్‌మెంట్ ఇవ్వాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్రమ నిర్బంధం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకురావడం, మహిళలు లేకుండా ఇద్దరు మహిళలను తీసుకురావడం వంటి అంశాలపై విచారణ అధికారులు సీరియస్ అయినట్టు సమాచారం.


ఇందులో నేరుగా పాల్గొన్నది ఎవరు?, తెర వెనుక ఉండి పాల్గొంది ఎవరు? అనే అంశాలపై విచారణ జరుపుతున్న అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే ఇందులో పాల్గొన్న ఒకరిద్దరు అధికారులను పిలిపించి పోలీస్ బాసులు మాట్లాడారు. కాగా ఈ వ్యవహారం ఐపీఎస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలా చేయడం మంచిది కాదంటూ మెజారిటీ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇది చేయించిన వారు సేఫ్‌గా ఉన్నారని, చేసిన వారు ఇరుక్కున్నారని పోలీస్ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

Updated Date - Aug 30 , 2024 | 08:05 PM