Share News

AP News: భారీ వర్షానికి నీట మునిగిన మచిలీపట్నం

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:32 AM

ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నీట మునిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తోంది.

AP News: భారీ వర్షానికి నీట మునిగిన మచిలీపట్నం

విజయవాడ: ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నీట మునిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లక్ష్మీటాకీస్ మొదలుకుని కోనేరుసెంటర్ వరకూ ప్రధాన రహదారిలో రెండు, మూడు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించిందన్నారు. దీంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షపు నీటిలో వాహనాలు మొరాయించడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 09:32 AM