Share News

Perni Nani: పేర్ని నాని సతీమణిపై పోలీసులు కేసు నమోదు

ABN , Publish Date - Dec 11 , 2024 | 02:33 PM

బందరు తాలుకా పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మానస తేజపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.

Perni Nani: పేర్ని నాని సతీమణిపై పోలీసులు కేసు నమోదు
YCP Leader Perni Nani

మచిలీపట్నం, డిసెంబర్11: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం దందా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల కాకినాడ సీ పోర్ట్‌ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు సిద్దంగా ఉంచిన నౌకను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ చేయించిన విషయం విధితమే. తాజాగా రేషన్ బియ్యం వ్యవహారంలో మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజన్ కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బందరు మండలం పొట్లపాలెంలో తన సతీమణి జయసుధ పేరిట పేర్నినాని గోడౌన్‌ను నిర్మించారు. దీనిని పౌర సరఫరాల శాఖకు బఫర్ గోడౌన్‌గా ఆయన అద్దెకు ఇచ్చారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా.. పది రోజుల క్రితం..పేర్ని జయసుధకు చెందిన గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Also Read : పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..


ఈ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌లో నిల్వ ఉన్న సరుకులో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు పౌరసరఫరాల ఉన్నతాధికారులు గమనించారు. ఇదే విషయాన్ని పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోటిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే పేర్ని నాని సతీమణి జయసుధతోపాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై సైతం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు


అయితే ఈ వ్యవహారంపై పేర్ని నానితోపాటు ఆయన భార్య స్పందించారు. వేబ్రిడ్జ్ సరిగ్గా పని చేయక పోవడం వల్లే సరుకు నిల్వలో షార్టేజ్ వచ్చిందని పౌర సరఫరాల ఉన్నతాధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె లేఖ రాశారు.

Also Read: హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్


షార్టేజ్‌కి సంబంధించి ధాన్యం విలువ ఎంత అయితే అంత ప్రభుత్వానికి చెల్లిస్తామని అధికారులకు రాసిన లేఖలో జయసుధ స్పష్టం చేశారు. ఇక ఈ వ్యవహారంలో పేర్ని నాని స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేబ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నాన్ని పేర్ని నాని చేస్తున్నారంటూ సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 02:34 PM