పల్లెలకు మహర్దశ
ABN , Publish Date - Oct 14 , 2024 | 11:49 PM
పల్లెపండుగతో గ్రామా ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అట్టహాసంగా పల్లెపండుగ కార్యక్రమం ప్రారంభం గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం
పీలేరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పల్లెపండుగతో గ్రామా ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోట్లా ది రూపా యలు వెచ్చించి గ్రామాభివృద్ధి పనులు ప్రారం భించడంతో ఇంత వరకు అభివృద్ధికి అంతంత మాత్రంగా ఉన్న పల్లెలు ముందుకు దూసుకెళ్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్ర మం సోమవారం పీలేరు మండలంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా అధికారులు మండలంలోని మేళ్లచెరువు పంచాయతీలో రూ.6 లక్షలు, గూడరేవుపల్లెలో రూ.5 లక్షలు, జాండ్ల పంచాయతీలో రూ.5 లక్షల అంచనాలతో సిమెంటు రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారం భిం చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శివశంకర్, పీఆర్ డీఈ, ఏఈ, ఉపాధి ఏపీడీ, కార్యదర్శులు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ఽకూటమి ప్రభుత్వ ధ్యేయమని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్య క్షుడు మల్లి కార్జునరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలం లోని జర్రావారిపల్లె, అయ్యావారిపల్లె, నగిరిమడుగు, ము స్టూరువాండ్లపల్లె, గండ బోయనపల్లె తదితర గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. జడ్పీటీసీ నిర్మల, ఎం పీడీవో మనోహర్‌రాజు, ఈవోఆర్‌డీ సుధాకర్‌రెడ్డి, నాయకు లు వల్లిగట్ల వెంకటరమణ, దామోధర్‌రెడ్డి, ప్రభాకర్, సర్పంచలు, సెక్రటరీలు పాల్గొన్నారు.
కలకడలో: కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలకు మహర్దశ పడుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సోమవారంపల్లె పండుగలో భాగంగా బాలయ్యగారిపల్లె, కలకడలో జరిగిన భూమిపూజలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ రహీం, ఏపీవో చెన్నకే శవులు, సర్పంచ విశ్వనాథ్, నాయకులు జిలానీ, ఇనాయ తుల్లా, ఇర్ఫాన, ఖాజా, ఇమ్రాన, ఏఈ రూప్‌సా గర్, కార్యదర్శులు ఉపాధి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో: మండలంలోని గ్రామాల్లోని 29 పనులకు సంబందించి 1.65 కోట్ల రూపాయలతో అబివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా మండల ప్రత్యేక అదికారి మునిరాజ్ కుమార్ మాట్లాడు తూ పెద్దతిప్పసముద్రం మండలంలో మల్లెల, తుమ్మర కుంట గ్రామాల్లో 29 పనులను ఉపాదిహామీ ద్వారా సిమెం ట్ రోడ్డు, బీటీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.
బి.కొత్తకోటలో:రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పల్లెపండుగ సోమ వారం బి.కొత్తకోట మండలంలోని గోళ్లపల్లె, శీలంవారిపల్లె పంచాయతీలలో ప్రారంభమైంది. మండలంలోని చింతల వారిపల్లె, రఘునాథపురం, చిటికివారిపల్లె, తోకలపల్లె తది తర గ్రామాల్లో రూ.38 లక్షలతో 9 చోట్ల సీసీ రోడ్ల నిర్మాణా నికి శ్రీకారం చు ట్టారు. ఎంపీడీవో శంకరయ్య, పంచాయతీ రాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ములకలచెరువులో:తంబళ్లపల్లె నియోజ కవర్గంలోని ఆరు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు మం జూరయ్యాయని డ్వామా ఏపీడీ మధుబాబు తెలిపారుజ తంబళ్లపల్లె నియోజ కవర్గంలో మంగళవారం నుంచి పల్లె పం డగ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. స్థానిక వినాయకనగర్‌లో జరిగే సీసీ రోడ్ల నిర్మాణానికి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయ చంద్రారెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తారని ములకలచెరువు టీడీపీ కార్యాలయం పేర్కొంది.
కలికిరిలో: మండలంలో సోమవారం నుంచి ప్రారంభమైన పల్లెకు పండుగ కార్యక్రమంలో రూ.85 లక్షలతో సీసీ రోడ్లు మం జూరైనట్లు ఎంపీడీవో భానుమూర్తి తెలిపారు. ఉపాధి నిధులతో 19 రోడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
నిమ్మనపల్లిలో: నిమ్మనపల్లికు రూ.1.5కోట్లు మంజూరైన ట్లు ఎంపీడీవో పర మేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 10 పంచాయతీలలో బీటీ, సీసీ రోడ్లు 40పనులకు గానూ రూ.1.5 కోట్లు వచ్చిందన్నారు.