Mannava Mohana krishna : టెక్నాలజీతో మెరుగైన పౌర సేవలు
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:37 AM
సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చని రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్..
ఏపీటీఎస్ చైర్మన్‌గా మన్నవ మోహనకృష్ణ బాధ్యతలు
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చని రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు. ఏపీటీఎస్ చైర్మన్‌గా శుక్రవారం ఆయన విజయవాడ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే సంస్థ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఏపీటీఎస్ ద్వారా అందిస్తున్న సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాలను ప్రభుత్వ సంస్థలకు మరింత ఎక్కువగా సరఫరా చేయడం ద్వారా సంస్థకు అధిక ఆదాయాన్ని తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. సైబర్ అటాక్ నుంచి రక్షించుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏఐని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఐటీని విస్తరించాలన్న సంకల్పంతో మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారని, దేశీయ, విదేశీ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.