రోడ్లపై చర్చకు సిద్ధం: మంత్రి జనార్దన్‌రెడ్డి
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:07 AM
అసెంబ్లీకి హాజరు కాని జగన్‌కు కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
అసెంబ్లీకి హాజరు కాని జగన్‌కు కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ‘గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.40ు వాటాను కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన జగన్.. పోర్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గుంతల రహిత రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంటే.. గుంతల్లో చిడతల మేళం అంటూ జగన్ మీడియాలో వండివార్చిన కథనం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వం తరుపున చర్చకు సిద్ధమని, దమ్ముంటే జగన్ తమ సవాల్‌ను స్వీకరించాలి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి రూ.14 వేలు కోట్లు కేటాయిస్తే.. రూ.11,469 కోట్లు ఖర్చు చేసింది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.16,852 కోట్లు కేటాయించి, కేవలం రూ.7,334 కోట్లే ఖర్చు చేసింది. అందులోనూ రూ.2,300 కోట్లు అప్పులు కూటమి ప్రభుత్వం నెత్తిన పడేసింది. కనీసం గుంతలు కూడా జగన్ పూడ్చలేదు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఏపీ రోడ్ల గురించి అవహేళనగా మాట్లాడారు’ అంటూ గుర్తు చేశారు.