Share News

AP: వైసీపీ ఎమ్మెల్యేలకు సభకు రావాలని ఉంది.. కానీ..

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:52 PM

వైసీపీ అధినేత జగన్, వారి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

AP: వైసీపీ ఎమ్మెల్యేలకు సభకు రావాలని ఉంది.. కానీ..
Nara Lokesh

అమరావతి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకు గైర్హాజరు కావడంపై లోకేష్ ఎదుట ఎమ్మెల్యేలు ప్రస్తావించగా ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకు రాకపోతే వాళ్లను ఎన్నుకున్న ప్రజలను కూడా జగన్ అవమానించినట్టే కదా అని అన్నారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గౌరవించడం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది సభకు రావాలని కోరుకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులు మంత్రి లోకేష్ వద్ద ప్రస్తావించారు.

కాగా, అసెంబ్లీకి వెళ్లకూడదని మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మిగిలిన పది మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు జగన్‌నే నేరుగా అడిగారని.. ఆయన రాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు అయినా వెళతామని చెప్పారని అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి వద్దే వద్దని చెప్పారని అంటున్నారు. అయితే, ఎమ్మెల్యేలకు మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఏ కారణం లేకుండా అసెంబ్లీకి వెళ్లకపోతే ఎలా అని.. ప్రజలకు ఏం సమాధానం చెబుతామని వారిలో కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

Updated Date - Nov 14 , 2024 | 02:32 PM