పేదల వైద్యానికి పెద్దపీట: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:05 AM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు, మనోభావాలకు అనుగుణంగా ఉందని వైద్య ఆరోగ్య మంత్రి వై సత్యకుమార్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు, మనోభావాలకు అనుగుణంగా ఉందని వైద్య ఆరోగ్య మంత్రి వై సత్యకుమార్ చెప్పారు. ‘గత ఐదేళ్లలో అన్ని రంగాల్ని విధ్వంసం చేస్తే.. దాన్ని సరిజేస్తూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, సంపదను సృష్టిస్తూ, ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.18,421 కోట్లు ఆరోగ్యశాఖకు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చిచూస్తే ఇది 23ు అధికం. విద్యాశాఖ తర్వాత అత్యధిక కేటాయింపులు ఆరోగ్యశాఖకు జరగడం... ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వం రూ.2,500 కోట్లు బకాయి పెట్టిపోయింది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.1,300 కోట్లు బకాయిలు చెల్లించింది. గత ప్రభుత్వం మూలధన వ్యయం కింద ఐదేళ్లలో రూ.3,970 కోట్లు ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం ఈ ఏడాదికే రూ.2,100 కోట్లు కేటాయించింది. వైద్య కళాశాలల అంశంలో జగన్ చేయనిదానిని చేసినట్లు చెప్పుకొంటున్నారు’ అని వివరణాత్మకంగా పేర్కొన్నారు.