Share News

Minister S. Savita : తిరుమలలో ప్రసాదాల నాణ్యత పెరిగింది

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:38 AM

‘తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదంతో పాటు అన్నప్రసాదాల నాణ్యత పెరిగింది.

Minister S. Savita : తిరుమలలో ప్రసాదాల నాణ్యత పెరిగింది

  • భక్తులు ఇదే మాట చెబుతున్నారన్న మంత్రి సవిత

తిరుమల, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదంతో పాటు అన్నప్రసాదాల నాణ్యత పెరిగింది. ప్రస్తుతం టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని భక్తులే నాకు చెప్పారు’ అని బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తాను దర్శనం చేసుకుని కొంతమంది భక్తులతో నేరుగా మాట్లాడానన్నారు. వారంతా సౌకర్యాలు, అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అనంతరం తిరుమలలోని లేపాక్షిని మంత్రి సందర్శించారు. విక్రయాలు, అందుబాటులో ఉన్న వస్తువులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఐదు నెలల్లో దాదాపు 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆమె మీడియాతో అన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 05:38 AM