Share News

MLA: వైసీపీ నేతలు రికార్డులు దహనంచేసి భూముల కబ్జా చేశారు..

ABN , Publish Date - Dec 21 , 2024 | 11:18 AM

గత వైసీపీ పాలనలో రెవెన్యూ రికార్డులను దహనంచేసి ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(MLA Bojjala Sudheer Reddy) వ్యాఖ్యానించారు. దీంతో తమకు ఇష్టమొచ్చినట్లుగా ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకుని భూములు కాజేశారన్నారు.

MLA:  వైసీపీ నేతలు రికార్డులు దహనంచేసి భూముల కబ్జా చేశారు..

- వైసీపీ పాలనలో అక్రమాలపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

రేణిగుంట(తిరుపతి): గత వైసీపీ పాలనలో రెవెన్యూ రికార్డులను దహనంచేసి ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(MLA Bojjala Sudheer Reddy) వ్యాఖ్యానించారు. దీంతో తమకు ఇష్టమొచ్చినట్లుగా ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకుని భూములు కాజేశారన్నారు. రేణిగుంట మండలం అన్నాస్వామిపల్లెలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నల్లకోటును అడ్డుపెట్టుకుని చేసిన భూదందాను వెలికి తీస్తామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆరు రోజులు వర్ష సూచన


ప్రభుత్వ భూమిలో బంగ్లా నిర్మించుకుని నివాసం ఉండడాన్ని గుర్తించినట్లు తెలిపారు. సూరప్పకశం, కొట్రమంగంళంలతోపాటు ఈ గ్రామంలోని సర్వే నెం. 385, 341/1, 342/3, 343/3, 338/1, 2, 334, 335లలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. అన్నాస్వామిపల్లెలో భూములను రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.


ఆలయాన్నీ వదల్లేదు..

మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముక్కంటి ఆలయాన్నీ వదలకుండా దోచుకున్నారని సుధీర్‌రెడ్డి విమర్శించారు. జగనన్న కాలనీల కోసం స్థలసేకరణలో అగ్రిమెంట్లు చేసుకుని కేవలం రూ.7లక్షలు వంతున రైతులకు చెల్లించి ప్రభుత్వం నుంచి రూ.45 కోట్లు కొట్టేశారన్నారు. శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌ కాలనీలో అక్రమ నిర్మాణాల తొలగింపులో కనిపించని మాజీ ఎమ్మెల్యే.. స్వర్ణముఖి నది ఒడ్డున ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులను అడ్డుకోవడంలో అంతర్యమేమిటో చెప్పాలన్నారు.


వైసీపీ పాలనలో కొంత మంది రేణిగుంట(Renigunta) పరిసరాల్లో ఆక్రమిత భూముల్లో ప్లాట్లు వేసి విక్రయించారన్నారు. ఇలాంటి ప్లాట్లు కొనవద్దని తాను అప్పట్లో చెప్పానని గుర్తుచేశారు. ఎవరైనా వీటిని కొని నష్టపోతే అందుకు వైసీపీ నాయకులే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, తహసీల్దారు సురేష్‏బాబు, ఎంపీడీవో విష్ణు చిరంజీవి, అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 11:18 AM