Share News

Pawan Kalyan: మోదీజీ.. మేమంతా మీ వెనుక ఉన్నాం

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:24 PM

దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నేడు పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు

Pawan Kalyan: మోదీజీ.. మేమంతా మీ వెనుక ఉన్నాం

ఢిల్లీ: దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. నేడు పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష సమావేశంలో (NDA Parliamentary Meeting) పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామని అన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు.

ప్రధాని మోదీ సైతం పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌కు మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌ పేరును ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. మన సమక్షంలోనే పవన్‌ ఉన్నారు కాబట్టి పవన్‌ కల్యాణ్‌ అంటే ఒక సునామీ అని పేర్కొన్నారు. పవన్‌ అంటే పవనం కాదని.. సునామీ అని మోదీ పేర్కొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 02:12 PM