Share News

Kaushik's mother Saraswati : ఆస్పత్రి నుంచి నా బిడ్డ డిశ్చార్జి అయ్యేందుకు సహకరించండి

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:06 AM

బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బిడ్డ ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని కౌశిక్‌ తల్లి సరస్వతి కోరారు.

Kaushik's mother Saraswati : ఆస్పత్రి నుంచి నా బిడ్డ డిశ్చార్జి అయ్యేందుకు సహకరించండి

  • ఎన్టీఆర్‌ గారూ.. ఆదుకోవాలి మీరు: కౌశిక్‌ తల్లి సరస్వతి

తిరుపతి(వైద్యం), డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బిడ్డ ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని కౌశిక్‌ తల్లి సరస్వతి కోరారు. అలాగే, తన బిడ్డను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చిన సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆదుకోవాలన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న నా కొడుకు కౌశిక్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, దాతలు ముందుకు వచ్చి అందించిన ఆర్థిక సాయంతో నా బిడ్డకు వైద్యం చేయించాం. దాదాపు రూ.70 లక్షల వరకు ఖర్చయింది. వైద్యం పూర్తయింది. ఇప్పుడు డిశ్చార్జి చేసేందుకు మరో రూ.20 లక్షలకు పైగా అవసరం ఉంది. ఇందుకు గతంలో మాకు భరోసా ఇచ్చిన సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ముందుకు వచ్చి సాయం అందిస్తే పూర్తి ఆరోగ్యంగా నా బిడ్డను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకుంటాం’ అని సరస్వతి కోరారు. అలాగే దాతలు సైతం ముందుకు వచ్చి తన బిడ్డకు అండగా నిలిచి ఆదుకోవాలని ఆమె అభ్యర్థించారు.

Updated Date - Dec 24 , 2024 | 06:06 AM