MP Kesineni Nani : నేను దోచుకోను.. ఎవరినీ దోచుకోనివ్వను..!
ABN , Publish Date - Jan 01 , 2024 | 02:49 PM
Andhrapradesh: నీతినిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.
విజయవాడ : నీతినిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani) కీలక వాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ‘‘నేను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి మా అమ్మాయి శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. నేను, నా కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయరు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు’’ అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.