Share News

Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:17 AM

వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇవాళ (గురువారం) హోంమంత్రి అనితను కలవనున్నారు. మరి కాసేపట్లో సెక్రటేరియట్‌లో మంత్రితో భేటీ కానున్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని ఆమె కోరనున్నారని తెలుస్తోంది.

Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇవాళ (గురువారం) హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్‌లో మంత్రితో ఆమె సమావేశమయ్యారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రిని ఆమె కోరనున్నట్టు తెలుస్తోంది.

విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని జెత్వానీ విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. మరోవైపు తనపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా అరెస్ట్ చేసి మానసిక వేధింపులకు గురిచేసినందుకుగానూ నష్ట పరిహారం ఇప్పించాలని కాదంబరి జెత్వానీ కోరనున్నారు.


కాగా కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇటీవల కీలక పరిణామం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇటీవల వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా కుక్కల విద్యాసాగర్‌ పేరు చేర్చారు. విద్యాసాగర్‌పై క్రైం నంబర్‌ 469/2024తో 192, 211, 218, 220, 354(డీ), 467, 420, 469, 471, రెడ్‌విత్‌ 120(బీ) సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇవి కాకుండా 66(ఏ) ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ 2000ను కూడా పోలీసులు జత చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్‌ చట్టాలు బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎన్‌ఎస్ఎస్ (భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత), బీఎస్‌ఏ(భారతీయ సాక్ష్యా అధినియం)లను అమలు చేస్తోంది.


అయితే ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్లు చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌ కింద మాత్రం అండర్‌ సెక్షన్స్‌ 173 బీఎన్‌ఎస్‌ అని టైపు చేసి ఉంది. ఈ నేరం జులై నెలకు ముందు జరిగింది కాబట్టి అన్నీ ఐపీసీ సెక్షన్లే వర్తిస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కాదంబరి జత్వానీని వేధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 19 , 2024 | 12:36 PM