Home » Vangalapudi Anitha
హోం మంత్రి వంగలపూడి అనిత, జగన్ పర్యటనను ముందస్తు ప్రణాళికతో చేసిన డ్రామాగా అభివర్ణించారు. పోలీసులపై వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించి, విచారణ జరుగుతోందని తెలిపారు. జగన్‌పై ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి
Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు తిరుణాలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు.
Womens Day 2025: మహిళ తలుచుకుంటే సాధించలేనదంటూ ఏమీ లేదు. కొందరు మహిళలు పరిస్థితులు అనుకూలించక, భయంతో ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ, తమపై తమకు విశ్వాసం ఉండాలేగానీ.. సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు పలువురు మహిళలు. అలాంటి సక్సెస్ స్టోరీల్లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత జీవితం కూడా ఒకటి.. ఆమె ప్రస్థానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
ఏపీ శాసనమండలిలో దిశా చట్టం, దిశా యాప్‌పై అధికార... ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆమె చెప్పారు.
AP Govt: శేషాచలం అడవుల్లో కాలినడక వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి ఘటనపై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. అటవీ ప్రాంతంలో కాలినడక వెళ్లే భక్తుల కోసం పలు చర్యలు తీసుకుంది సర్కార్.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్‌పై హోం మంత్రి అనిత, మంత్రి సవిత స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.
సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
Visakhapatnam: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్ జైల్ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.