Share News

Payyavula Kesav: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే నా తొలి బాధ్యత

ABN , Publish Date - Jul 11 , 2024 | 01:35 PM

ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆవెంటనే 15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.

Payyavula Kesav: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే నా తొలి బాధ్యత

అమరావతి: ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ (Payyavula Kesav) నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆవెంటనే 15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన మొదటి బాధ్యతగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 16 పథకాలను ఆపేసిందని.. వాటిలో 60 శాతం రాష్ట్రం... 40 శాతం కేంద్రం నిధులు పెట్టేవని పేర్కొన్నారు. వీటి మొత్తాన్ని ఆపేశారని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కేంద్రం నిధులు కూడా వాడుకోని పరిస్థితి వైసీపీ హయాంలో ఉందన్నారు. వ్యవస్థలు అన్నీ గాడి తప్పాయన్నారు. ఎవరు జగన్‌కి సలహా ఇచ్చారో కూడా తెలియదని పయ్యావుల కేశవ్ అన్నారు.


రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం.. ఎకానమీని పునరుద్ధరించడం తమ లక్ష్యమని పయ్యావుల కేశవ్ తెలిపారు. గడచిన ఐదేళ్లలో వ్యవస్థను దెబ్బతీశారన్నారు. కామన్ మ్యాన్ నుంచి వచ్చే కన్నా పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీంలు సరిగా వాడితే ఎంతో మేలన్నారు. ఎలక్ట్రసిటీపై డ్యూటీలను దారుణం గా వేశారన్నారు. అక్క చెల్లమ్మలకు, అవ్వ తాతలకు జగన్ ఇచ్చిన దాని కన్నా దోచింది ఎక్కువని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు టీం శక్తికి మించి ఈ రాష్ట్రం కోసం పని చేస్తోందన్నారు. ఏపీలో టాక్సాషన్‌ను కౌంటర్ ప్రొడక్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్లారన్నారు. టాక్స్‌లు పెంచడం ఒక స్థాయికి తెచ్చారని.. చివరకు భరించలేకుండా చేశారన్నారు. వ్యాపారాలను కొలాప్స్ చేశారన్నారు.

ఇవి కూడా చదవండి...

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 01:35 PM