Share News

‘హాయ్‌’ అంటే చాలు ధాన్యం కొంటాం!

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:04 AM

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేశామని, రైతుల సమయం వృథా కాకుండా వాట్సప్‌ ద్వారా సేవలందిస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

‘హాయ్‌’ అంటే చాలు ధాన్యం కొంటాం!

వాట్సప్‌ నంబరు 73373 59375

పౌరసరఫరాలశాఖ సేవలు సులభతరం

రైతుల సమయం వృథా కాకూడదనే: మంత్రి నాదెండ్ల

అమరావతి, తెనాలి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేశామని, రైతుల సమయం వృథా కాకుండా వాట్సప్‌ ద్వారా సేవలందిస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు తమ వాట్సప్‌ ద్వారా 73373-59375 నంబరుకు హాయ్‌(ఏజీ) అని మెసేజ్‌ పెడితే కొనుగోలు ప్రక్రియ చకచకా జరుగుతుందని ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వాట్సప్‌ సందేశం పంపగానే కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా ప్రత్యేక వాయి్‌సతో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందన్నారు. రైతు మొదట తన ఆధార్‌ నంబరు నమోదు చేసి, ఆ తర్వాత పేరును ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి. తర్వాత ధాన్యం అమ్మదలచిన తేదీలకు మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒక తేదీని రైతు ఎంచుకోవాలి. అలాగే సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆపై ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారనే ఆప్షన్‌ ఉంటుంది. తర్వాత ఎన్ని బస్తాల ధాన్యం అమ్మదలిచారో నమోదు చేయాలి. దీంతో స్లాట్‌ బుక్‌ అయినట్లు ఓ ప్రత్యేక సందేశం ద్వారా షెడ్యూల్‌ అయిన కూపన్‌ కోడ్‌ వస్తుంది. ఆ తేదీ, సమయంలో ఎంచుకున్న కొనుగోలు కేం ద్రం వద్దకు వెళ్లి రైతు సులభంగా ధాన్యం అమ్ముకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద గంట ల తరబడి వేచి ఉండకుండా, ధాన్యం కొనుగోలుకు ఎవరినీ బతిమలాడకుండా రైతు ఈ ప్రక్రియ ద్వారా సులభంగా ధాన్యం అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తరహాలో ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ ఫార్మ ర్‌ సర్వీస్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సరళతరం చేసినట్టు మంత్రి మనోహర్‌ తెలిపారు.

Updated Date - Nov 18 , 2024 | 04:05 AM