Janasena: జనసైనికులకు నాగబాబు కీలక సూచన.. ఇక షురూ..
ABN , Publish Date - Mar 09 , 2024 | 10:24 PM
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) గెలుపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. రెండోసారి అధికారం రావాల్సిందేనని వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు కూటమి మాత్రం వైసీపీని ఇంటికి పంపించాల్సిందేనని వ్యూహ రచన చేస్తోంది. శనివారం నాడే ఎన్డీఏ (NDA) కూటమిలో టీడీపీ, జనసేన చేరినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) గెలుపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. రెండోసారి అధికారం రావాల్సిందేనని వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు కూటమి మాత్రం వైసీపీని ఇంటికి పంపించాల్సిందేనని వ్యూహ రచన చేస్తోంది. శనివారం నాడే ఎన్డీఏ (NDA) కూటమిలో టీడీపీ, జనసేన చేరినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ క్రమంలో జనసేన కీలక నేత, పార్టీ అధినేత సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేస్తూ.. జనసైనికులకు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఎక్స్‌లో ఈ ట్వీట్ చూసిన టీడీపీ, జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?
సిద్ధం.. అన్నోళ్ళకి యుద్ధమే..
‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం. ఆలోచించాల్సిన సమయం కాదిది.. నాయకుడి ఆదేశాలు ఆచరణలో పెట్టాల్సిన సమయం. విమర్శ, విభేదాల సమయం కాదిది.. విజ్ఞతతో విజయదుందుభి మోగించాల్సిన సమయం. శత్రువు మాయలోపడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్.. తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు.. నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సిద్ధం.. సిద్ధం.. అన్నోళ్ళకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అని నాగబాబు ఎక్స్‌లో రాసుకొచ్చారు. పనిలో పనిగా.. ‘సిద్ధం.. సిద్ధం’ అంటూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డికి కూడా ఒకింత చురకలు అంటించారు. ఈ ట్వీట్‌పై వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సైతం గట్టిగానే స్పందిస్తున్నారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..