Share News

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

ABN , Publish Date - Feb 21 , 2024 | 02:45 PM

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

కుప్పం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సతీమణి నారా భువనేశ్వరీ(Nara Bhuvaneshwari) ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.

చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారని.. ఈ సారి తనను గెలిపిస్తారా అంటూ చమత్కరించారు. తమకు ఇద్దరూ కావాలంటూ సభికులు చేతులెత్తారు. అలా కుదరదని.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ భువనేశ్వరీ చమత్కరించారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని.. ఎప్పుడు సీరియస్‌గా రాజకీయాలే కాదు.. అప్పుడప్పుడు సరదా సంభాషణలూ జరగాలని ఆమె అన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Feb 21 , 2024 | 04:26 PM