Share News

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌కి రండి

ABN , Publish Date - Oct 25 , 2024 | 05:21 AM

బెంగళూరులోని బహుళ జాతి కంపెనీలను (ఎంఎన్‌సీలు) ఆంధ్రప్రదేశ్‌కు రావాలని మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఆహ్వానించారు.

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌కి రండి

  • అక్కడి లాజిస్టిక్‌ సమస్యలను ఎత్తిచూపిన

  • పారిశ్రామికవేత్త పాయ్‌ పోస్టుకు ప్రతిస్పందన

  • జగన్‌ విధ్వంసం మర్చిపోలేం.. రాలేమన్న పాయ్‌

బెంగళూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని బహుళ జాతి కంపెనీలను (ఎంఎన్‌సీలు) ఆంధ్రప్రదేశ్‌కు రావాలని మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఆహ్వానించారు. బెంగళూరులో అపరిష్కృతంగా ఉన్న లాజిస్టిక్‌ సమస్యలపై ప్రముఖ కర్ణాటక పారిశ్రామికవేత్త మోహన్‌దా్‌స పాయ్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో చేసిన ట్వీట్‌కు లోకేశ్‌ ఇలా స్పందించారు. బెంగళూరులో రోడ్లు, డ్రైనేజీ, రింగ్‌ రోడ్డు, ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎంఎన్‌సీలకు అసంతృప్తి ఉన్నదని ఆ ట్వీట్‌లో మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యానించారు. అందుకే నగరం వెలుపలకు విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. దీనిపై లోకేశ్‌ రీట్వీట్‌ చేస్తూ... ఎంఎన్‌సీలను ఏపీకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఏపీకి వస్తే తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దీనిపై పాయ్‌ స్పందిస్తూ... ఏపీలో గత ప్రభుత్వం (జగన్‌) అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, మళ్లీ విశ్వాసం పొందాలంటే సీఎం చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేయాలన్నారు. అప్పటి విధ్వంసాన్ని మర్చిపోలేమని, ఇప్పట్లో రాలేమని తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 05:21 AM