Share News

Mangalagiri MLA: రెడ్ బుక్‌పై స్పందించిన నారా లోకేశ్

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:00 PM

మంగళగిరి ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా రెడ్ బుక్‌పై స్పందించారు. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ ఎందుకు ఫేమస్ అయింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది తదితర వివరాలను వెల్లడించారు.

Mangalagiri MLA: రెడ్ బుక్‌పై స్పందించిన నారా లోకేశ్
Mangalagiri MLA Nara Lokesh

అమరావతి, జూన్ 07: మంగళగిరి ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా రెడ్ బుక్‌ అంశంపై స్పందించారు. శుక్రవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ ఎందుకు ఫేమస్ అయింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది తదితర వివరాలను వెల్లడించారు. రెడ్ అంశం ఇంత ఫేమస్ అవుతుందని తాను కూడా ఊహించలేదన్నారు. తాను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నానని చెప్పారు. అనంతరం ప్రజలకు సేవ చేసేందుకు ఏపీకి తిరిగి వచ్చానని తెలిపారు. అయితే 2013 నుంచి 2019 వరకు తాను పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కలేదని.. అలాగే చట్టాన్ని సైతం అతిక్రమించలేదని పేర్కొన్నారు. తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు.

Also Read: Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..


కానీ 2019 నుంచి 2024 మధ్య తనపై 26 తప్పుడు కేసులు నమోదు చేశారని గుర్తు చేసుకున్నారు. ఏడు సార్లు తాను పోలీస్ స్టేషన్‌కు సైతం వెళ్లవలసి వచ్చిందని చెప్పారు. సీఐడీ విచారణ సైతం తాను ఎదుర్కొన్నానని తెలిపారు. తనపై హత్య కేసుతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారని వివరించారు. అయితే తాను నేరం చేస్తే ఒప్పుకోవచ్చు కానీ నేరం చేయకుండా ఇన్ని కేసులు తనపై ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ తరహా కేసులతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి


ఇక ఒకానొక స్టేజ్‌లో.. ప్రజల్లోకి వెళ్లి మాట్లాడకూడదనే విధంగా తన పట్ల పోలీసులు ప్రవర్తించారని లోకేష్ చెప్పారు. తన పాదయాత్రను ఆపేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారని అన్నారు. కానీ తాను అవేమి పట్టించుకోకుండా తన పాదయాత్రను కొనసాగించానని నారా లోకేశ్ తెలిపారు. ఆ సమయంలో తన చేతిలో భారత రాజ్యాంగం ఉందన్నారు. బల్లపై నిలబడి ప్రజలనుద్దేశించి ప్రసంగించానని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు, వైసీపీ శ్రేణులు తన మైక్‌‌ను లాక్కొనే ప్రయత్నం చేశారన్నారు. అంటే.. వారంతా రాజ్యాంగాన్ని అతిక్రమించే ప్రయత్నం చేశారని నారా లోకేశ్ పేర్కొన్నారు. దాంతో రెడ్ బుక్ ఆలోచన వచ్చిందని నారా లోకేశ్ స్పష్టం చేశారు. మరోవైపు నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో రెడ్ బుక్ పేరిట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం విధితమే.

Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం

Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన

Also Read: Breaking: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 09:09 PM