ఏఐ వర్సిటీ ఏర్పాటుకు సలహాలివ్వండి
ABN , Publish Date - Oct 25 , 2024 | 03:32 AM
అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రఖ్యాత ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ను మంత్రి నారా లోకేశ్ కోరారు.
ఎన్‌విడియా సీఈవోతో మంత్రి లోకేశ్ భేటీ
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రఖ్యాత ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌ను మంత్రి నారా లోకేశ్ కోరారు. గురువారం ముంబైలో ఆయనతో మంత్రి భేటీ అయ్యారు. ఏపీ పాలనా వ్యవహారాల్లో ఏఐను ఉపయోగించాలనేది తమ ఆలోచనా విధానమని లోకేశ్ తెలిపారు. దీనిపై హువాంగ్ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఏఐలో రాబోయే విప్లవాత్మక మార్పులను వివరించారు. కాగా, స్పీచ్ రికగ్నైజేషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీకి అవసరమైన పవర్ టూల్స్, అల్గారిథమ్‌ను ఎన్‌విడియా అందిస్తోంది.