Nature Farming : ప్రకృతి వ్యవసాయం - రైతుకు ఆదాయం
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:00 PM
ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరాడు. 15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తాను లాభాలు పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయ పాఠశాల ద్వారా మరింత మంది రైతులకు సలహాలు ఇస్తూ వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తవలం పం చాయతీ చౌకిళ్లవారిపల్లె రైతు గుమ్మడి గంగులప్ప సామాన్య రైతు కటుంబీకుడు.
15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయ పాఠశాలతో రైతులకు సలహాలు
ఐదంచెల సేద్యంతో అధిక లాభాలు : ఆదర్శ రైతు
నిమ్మనపల్లి, అక్టోబరు20(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరాడు. 15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తాను లాభాలు పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయ పాఠశాల ద్వారా మరింత మంది రైతులకు సలహాలు ఇస్తూ వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తవలం పం చాయతీ చౌకిళ్లవారిపల్లె రైతు గుమ్మడి గంగులప్ప సామాన్య రైతు కటుంబీకుడు. ప్రకృతి వ్యవసా యం ఆద్యుడు డాక్టర్ సుభాష్‌పాలేకర్‌ను సైతం గంగులప్ప చేస్తున్న వ్యవసాయం నిమ్మనపల్లికి రప్పించింది. ఒక ఆవుతో 30 ఎకరాలు సాగు చేయవచ్చని నిరూపించాడు. వివరాల్లోకెళితే....
చౌకిళ్లవారిపల్లె రైతు గుమ్మడి గంగులప్ప సామా న్య రైతు కటుంబీకుడు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టినిలిపి ప్రకృతి వ్యవసాయంతో తాను లాభా లు పొందడమే మరింత మంది రైతులకు సలహా లు ఇస్తూ వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తు న్నాడు. బెంగళూరుకు చెందిన సురేష్ అనే రైతు తనతో మాట్లాడుతూ ఒక ఆవుతో 30 ఎకరాలు సాగు చేయవచ్చన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో పండించిన అరటి
దీంతో ప్రకృతి వ్యవసా యంపై మక్కువతో అతడి సలహాలు తీసుకుని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అనంత రం ప్రకృతి వ్యవసాయ వైద్య విజ్ఞాన కేంద్రం పేరుతో జీవరక్షణ, గోసంరక్షణతో రిజిస్ర్టేషన్ చేసి ప్రకృతి వ్యవసాయ పాఠశాలను ప్రారంభించాడు. ప్రస్తుతం తనకు ఉన్న వ్యవసా య పొలంలో ప్రకృతి నర్సరీని ఏర్పాటు చేసి వాటి ద్వారా నారును రైతులకు అందిస్తూ తాను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. రైతు గంగుల ప్ప ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రస్తుతం క్రిమి సంహారక మందుతో పండించే పంటల ద్వారా మానవాళికి ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు పండిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మామిడి తోటలో అంతర పంటగా మిరప, టమాట, వంగ, బీర, కాకర, బెండ, పసుపు, అనప, గుమ్మడి, అరటి, మునగ, హర్యానా సొద్దల పంటను పండిస్తున్నట్లు తెలిపా రు. తనకు ఉన్న 5 ఆవుల్లో పుంగనూరు, ఒంగోలు జాతికి చెందిన ఆవులు ఉండగా వాటి ద్వారా పే డను సేకరించి పంటకు వాడుతున్నట్లు తెలిపారు. ఈ పంటలను కేవలం ఆవు నుంచి సేకరించిన పేడ ద్వారా జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి మజ్జిగ వంటివి వేసి పంటకు వేస్తానని తెలిపారు.
గంగులప్ప ప్రారంభించిన నర్సరీ
అలాగే నర్సరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రకాల కూరగాయలు ఎకరాకు 10 టన్నులు పండిస్తున్నట్లు తెలిపారు. మార్కెటిం గ్ సక్రమంగా ఉంటే లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. అంతేకాకుండా పలు వురు రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి సల హాలు, సూచనలు కావాలంటే 9059125954ను సంప్రదించాలని తెలిపారు.
ఐదంచెల విధానంతో అధిక లాభాలు
ఐదంచెల విధానం అనగా ఒకటి.. భూమిలోపల పండే గడ్డజాతి ముల్లంగి, బంగాళదుంప, రెండోది మిరప వంగ, మూడోది బీర కాకర, పొట్ల, నాలుగోది జామ, సపోట దానిమ్మ, బొప్పాయి, అరటి, మునగ ఐదోది శాశ్వత పంటలైన అల్లనేరేడు మామిడి, కొబ్బరి పంటల ద్వారా అధిక లాభాలు సాధించ వచ్చని తెలిపారు.
సుభాష్ పాలేకర్‌ను పల్లెకు రప్పించిన రైతు
గంగులప్ప చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని చూ సేందుకు డాక్టర్ సుభాష్‌పాలేకర్ నిమ్మనపల్లిలోని చౌకిళ్లవారిపల్లికి వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని పరి శీలించి ప్రశంసించారు. 2016 హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు ద్వారా ఉత్తమ రైతు ప్రశంసా పత్రం అందుకున్న ఘనత గంగులప్పది.