AP News: జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో భారీ అక్రమాలు!
ABN , Publish Date - Aug 18 , 2024 | 09:12 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల పేర్లతో పెద్ద ఎత్తున నిధులను అధికారులు, సిబ్బంది దోచేసినట్టుగా తెలుస్తోంది.
నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల పేర్లతో పెద్ద ఎత్తున నిధులను అధికారులు, సిబ్బంది దోచేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా ఎన్ఆర్ఐల పేర్లుతోనూ జాబ్ కార్డులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించకుండానే సైదాపురం ఏఈ తన అకౌంట్‌లోకి ఏకంగా తన అకౌంట్‌కి రూ.1.7కోట్ల నిధులు మళ్లించుకున్నారు. పైగా అతడికే గూడూరు ఇన్‌చార్జీ డీఈగా బాధ్యతలు అప్పగించారు. అనంతసాగరంలో తండ్రికి బదులు కుమారుడు విధులు అప్పగించడంతో రూ.కోట్లలో నిధులు స్వాహా అయినట్టు తెలుస్తోంది. ఏబీఎన్ నిఘాలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కీలక ఆధారాలను సంపాదించింది.