Share News

Anam: రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు.. వైసీపీపై ఆనం ఆగ్రహం

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:42 PM

Andhrapradesh: గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆనం తెలిపారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పొంగూరు, నాయుడుపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి ఆనం వెల్లడించారు.

Anam: రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు.. వైసీపీపై ఆనం ఆగ్రహం
Minister Anam Ramnarayana Reddy

నెల్లూరు, డిసెంబర్ 10: వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆత్మకూరు ఎమ్మెల్యే, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మర్రిపాడు మం పొంగూరు గ్రామంలో రెవెన్యూ సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటోను ముద్రించి రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.

రాంగోపాల్‌ వర్మకు గుడ్‌ న్యూస్


గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పొంగూరు, నాయుడుపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అంతుకుముందు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రెవెన్యూ సదస్సును మంత్రి ఆనం ప్రారంభించారు.

మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న ఇరువర్గాలు


ఈ వార్త కూడా చదవండి...

ఆ ఒక్కటి చాలు విజయసాయిని లోపలేయొచ్చు: సోమిరెడ్డి

అమరావతి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విజయసాయిని లోపలేయటానికి పింక్ డైమండ్‌పై చేసిన అసత్యం ఒక్కటి చాలన్నారు. ఒళ్లు కొవ్వెక్కి విజయసాయి ముఖ్యమంత్రిని తిడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయసాయి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు జగన్‌తో అవినీతిలో పోటీపడిన ఏ2 విజయసాయి అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Lagacharla: లగచర్ల దాడి కేసు.. విచారణలో సంచలన విషయాలు

ఆ రైతుల్లో సంతోషం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 01:48 PM