Share News

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:36 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన పెన్షన్‌ విధానం తీసేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ బిట్రగుంట బ్రాంచ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. బిట్రగుంట రైల్వేస్టేషన్‌ ఎదురుగా సంఘ్‌ అధ్యక్షుడు గోవిందరాజు, కార్యదర్శి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో గురువారం రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భం

 పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి
2బిటిటిఆర్‌11 : రైల్వేస్టేషన్‌ ఎదురుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఎంప్లాయీస్‌ సంఘ్‌ నేతలు

బిట్రగుంట, జనవరి 11: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన పెన్షన్‌ విధానం తీసేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ బిట్రగుంట బ్రాంచ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. బిట్రగుంట రైల్వేస్టేషన్‌ ఎదురుగా సంఘ్‌ అధ్యక్షుడు గోవిందరాజు, కార్యదర్శి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో గురువారం రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ్‌ నాయకుడు మర్రి రాఘవయ్య పిలుపు మేరకు దీక్ష చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైల్వే కార్మికుడికి న్యాయం జరిగేలా చూడడమే ప్రధాన లక్ష్యంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ పనిచేస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచి సభ్యులు తులసీ , మస్తాన్‌, పవన్‌కుమార్‌, వరప్రసాద్‌, విజయభాస్కర్‌, తిరుపతి, బ్రహ్మయ్య, నాగరాజు, రాజకుమారి, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

--------------

Updated Date - Jan 11 , 2024 | 10:36 PM