Share News

వెండి నందిపై కామాక్షితాయి విహారం

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:10 PM

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సోమవారం రాత్రి జొన్నవాడ కామాక్షితాయిని పెద్ద వెండి నంది వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా గం

వెండి నందిపై కామాక్షితాయి విహారం
1బీఆర్‌పీ1 : కామాక్షితాయి దర్శనానికి పోటెత్తిన భక్తులు

స్వామి, అమ్మవార్లకు వైభవంగా కల్యాణం

బుచ్చిరెడ్డిపాళెం,జనవరి1: ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సోమవారం రాత్రి జొన్నవాడ కామాక్షితాయిని పెద్ద వెండి నంది వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా గంగా, కామాక్షితాయి సమేత మల్లికార్జునస్వామికి ప్రత్యేక కల్యాణోత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. నెల్లూరుకి చెందిన శ్రీనివాస హ్యాండ్‌లూం సెంటర్‌, విజయలక్ష్మి టెక్స్‌టైల్స్‌ నిర్వాహకులు, కామాక్షి మెడికల్స్‌ నిర్వాహకులు అచ్యుత శివకుమార్‌, నారాయణరావు, మోహన్‌రావులు భక్తులకు ఉచితంగా ప్రసాదాలు అందజేశారు. నందిసేవ గ్రామోత్సవానికి హైదరాబాదుకు చెందిన జనంపల్లి దుష్యంత్‌రెడ్డి, మేఘన,సాకేత్‌లు, కల్యాణోత్సవానికి జొన్నవాడకి చెందిన జొన్నవాడ రవికుమార్‌ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ సుబ్రహ్మణ్యంనాయుడు, ఈవో గిరికృష్ణ, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.

Updated Date - Jan 01 , 2024 | 11:10 PM