Share News

ఐటీడీఏ పీవోపై విచారణ జరపించాలి

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:30 PM

ఐటీడీఏ పీవోపై విచారణ జరిపించాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.

ఐటీడీఏ పీవోపై విచారణ జరపించాలి
2 కరుణానిధి 4 : కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న యానాదుల సంక్షేమ సంఘం నాయకులు

నెల్లూరు(హరనాథపురం), మార్చి 4 : ఐటీడీఏ పీవోపై విచారణ జరిపించాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడి అవినీతికి కేరాఫ్‌గా మారిన నెల్లూరు ఐటీడీఏ పీవోపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టులో జరిగిన ఆదివాసి దినోత్సవ సభలో భోజనాలకే రూ.4.30 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు. పీవో అవినీతి, నిధుల దుర్వినియోగానికి సంబంధించి పూర్తి ఆధారాలను కలెక్టర్‌కు సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, మల్లిక ప్రభావతి, రాపూరు నారాయణ, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:30 PM