Amaravati: ఆన్‌లైన్‌లో సీఆర్‌డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్లు
ABN , Publish Date - Nov 30 , 2024 | 06:51 PM
చంద్రబాబు సారథ్యంలో కూటిమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాజధాని నిర్మాణంలో సీఆర్‌డీఏ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ ఆఫీస్ డిజైన్లు ఎంపిక చేసేందుకు.. ప్రజలను భాగస్వామ్యం చేయనుంది.
అమరావతి, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సీఆర్‌డీఏ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనదన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఆర్‌డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్లపై ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ ఆఫీసుకు సంబంధించిన డిజైన్లను సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో పెట్టింది. ఆన్‌లైన్ ద్వారా సీఆర్‌డీఏ.. ఓటింగ్ నిర్వహిస్తుంది. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే భావనలో భాగంగా ఈ డిజైన్లపై ఓటింగ్‌కు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.
Also Read: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల
డిసెంబర్ 6వ తేదీ వరకు...
ఈ ప్రాజెక్టు ఆఫీసు ఎలా ఉండాలనే దానిపై నమూనాలను ఓటింగ్ కోసం ఆన్‌లైన్‌లో సీఆర్‌డీఏ ఉంచింది. అందుకోసం 10 డిజైన్లను సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో ఉంచింది. తమకు నచ్చిన డిజైన్‌పై క్లిక్ చేసి ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సీఆర్‌డీఏ విజ్జప్తి చేసింది. ఈ ఓటింగ్ ప్రక్రియ డిసెంబర్ 6వ తేదీ వరకూ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని శనివారం సీఆర్‌డీఏ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: పవన్ చేసింది కరెక్టే: ఎంపీ పురందేశ్వరి
జనవరి నుంచి పనులు..
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల కొలువు తీరిన తర్వాత.. రాజధాని అమరావతి పనులకు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు సంస్థలకు భూముల కేటాయింపుపై శుక్రవారం సబ్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో రాజధానిలో పనులు జనవరి నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు.
Also Read: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సీఆర్‌డీఏ కీలకం.. అంతలో ఎన్నికలు..
అయితే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రాజధాని ఎంపిక.. రైతుల నుంచి భూముల సేకరణ తదితర అంశాల్లో సీఆర్‌డీఏ కీలకంగా వ్యవహరించిందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇంతలో ఎన్నికల్లో రావడంతో.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయింది. ఆయన పాలనలో రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రజలు, రైతులు ఆందోళనలు ఏళ్లకు ఏళ్లు సాగాయి. వారంతా నిరసనలు, దీక్షలు, ఆందోళనలు, పాదయాత్రలు సైతం చేపట్టారు. కానీ వైఎస్ జగన్ మాత్రం స్పందించ లేదు. వారి మాటకు కనీస విలువ కూడా ఇవ్వలేదు.
Also Read: రాహుల్ గాంధీ స్వాతిముత్యం
పీపుల్స్ క్యాపిటల్ అని ముందే చెప్పిన..
ఇంతలో మళ్లీ ఎన్నికలు రావడంతో... చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో అభివృద్ధి మళ్లీ పరుగందుకుంది. అదీకాక రాజధాని అమరావతి అంటే పీపుల్స్ క్యాపిటల్ అని రాజధాని ఎంపిక సమయంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రాజధాని నిర్మాణంలో ప్రతి అంశంలో వివాదాలకు తావు లేకుండా ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
For AndhraPradesh News Telugu News