Share News

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వారికి మాత్రమే అనుమతి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:32 AM

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు.. ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వారికి మాత్రమే అనుమతి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు.. ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి అనుమతిస్తున్నారు.


గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్‌ ప్రక్కన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్‌, వైజాగ్‌ వీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్‌ హ్యాంగర్స్‌తో భారీ టెంట్‌ను వేస్తున్నారు. ఆదివారం టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త, ప్రత్యేకాధికారులు ప్రద్యుమ్న, బాబు.ఎ, వీర పాండ్యన్‌, వ్యవసాయ శాఖ కమీషనర్‌ హరికిరణ్‌, రాష్ట్ర అదనపు డీజీపీ బాబ్జీ, ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్‌ కుమార్‌, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, సీపీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ పరిశీలించారు.

Updated Date - Jun 10 , 2024 | 11:39 AM