Collector Shyamprasad : అర్జీదారులకు అతిథి మర్యాదలు
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:44 AM
పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పార్వతీపురం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్జీదారుల పక్కనే కూర్చుని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ వినతులు స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎ్‌సకు వచ్చిన వారిని కూర్చొబెట్టి.. టీ ఇచ్చిన తర్వాత అర్జీలు స్వీకరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ మార్పులపై అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.