Share News

Pawan Kalyan : పర్యావరణహితంగా ఉత్సవాలు

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:41 AM

పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలని, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan : పర్యావరణహితంగా ఉత్సవాలు

  • మట్టి వినాయకుడిని పూజించేలా అవగాహన: పవన్‌

అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలని, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన చేపట్టిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలిస్తున్నారు.

ఆదివారం మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయరామ్‌ కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్‌, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను చూపించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 04:41 AM