Share News

AP Politics: శాసనసభ నియమావళిపై ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సూచనలు..

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:07 PM

జనసేన(Janasena) ఎమ్మెల్యేలకు శాసనసభ(Legislative Assembly) నియమావళిపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింప చేసేలా అసెంబ్లీలో వ్యవహరించాలని ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం సూచించారు.

AP Politics: శాసనసభ నియమావళిపై ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సూచనలు..

అమరావతి: జనసేన(Janasena) ఎమ్మెల్యేలకు శాసనసభ (Legislative Assembly) నియమావళిపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింప చేసేలా అసెంబ్లీలో వ్యవహరించాలని ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం సూచించారు. ప్రతీ ఒక్క ఎమ్మెల్యే సభా నియమావళిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సభా సంప్రదాయాలు గౌరవిస్తూ నడుచుకోవాలని హితబోధ చేశారు. శాఖాపరమైన అంశాలు, ప్రజా సమస్యలు అధ్యయనం చేసిన తర్వాతే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడవద్దని, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.


జనసేనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారని, 100శాతం స్ట్రయిక్ రేట్‌, భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించారని ఎమ్మెల్యేలకు పవన్ గుర్తు చేశారు. తొలి 100రోజులపాటు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీపడొద్దని ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా పర్యటన ఉంటుందని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Updated Date - Jun 25 , 2024 | 09:07 PM