Share News

Pawan Kalyan: సనాతన ధర్మంపై దాడి చేస్తే.. సత్తా చూపిస్తాం

ABN , Publish Date - Oct 03 , 2024 | 06:41 PM

తనకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు ఉండవని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశా..భరించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందన్నారు. ఈ వంద రోజుల్లో బయటకు రాలేదన్నారు.

Pawan Kalyan: సనాతన ధర్మంపై దాడి చేస్తే.. సత్తా చూపిస్తాం

తిరుపతి, సెప్టెంబర్ 03: తనకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు ఉండవని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశా..భరించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందన్నారు. ఈ వంద రోజుల్లో బయటకు రాలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టామని తెలిపారు.


గురువారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తిరుమలలో వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఉంటామా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతీది రాజకీయం, ఓట్ల కోసమేనా? అంటూ వైసీపీ చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని పవన్ కొంత అసహనం వ్యక్తం చేశారు.


అయితే ఇది చాలా కీలకమైన సభ అని ఆయన పేర్కొన్నారు. మీతో జేజేలు కొట్టించుకోవడానికి తిరుపతి రాలేదన్నారు. మీతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికి తిరుపతికి వచ్చానని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.


ఒక డిప్యూటీ సీఎంగానో.. జనసేన పార్టీ అధ్యక్షుడిగానో ఇక్కడికి రాలేదన్నారు. హిందూవుగా.. భారతీయుడిగా ఇక్కడి వచ్చానని తెలిపారు. తిరుపతిలో కల్తీ ప్రసాదం పెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల సమయం కాదు.. సినిమా సమయం కాదన్నారు. ఇది భగవంతుడి సమయం అని ఆయన స్పష్టం చేశారు. ఇతర మతాలను చూసి నేర్చుకోవాలన్నారు. సనానత హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.


దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రాముడిని తిడితే నోరెత్త కూడదు.. మనది లౌకికవాద దేశమంటారన్నారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే.. వాళ్లు వదిలేస్తారా? అని ప్రశ్నించారు. లౌకిక వాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు కూడా లేదన్నారు.


సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వమంటే.. అన్ని మతాలను కలుపుకు వెళ్లడమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మిగతా మతాలపై దాడి జరిగితే.. ప్రముఖులంతా మాట్లాడతారన్నారు. తప్పని తెలిసి కూడా మాట్లాడడం ఇంకా తప్పని ఆయన చెప్పారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంత మంది అంటున్నారని తెలిపారు.


సనాతనధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారని చెప్పారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినిపించవని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా.. ఎవరు మాట్లాడరన్నారు. మనం పళ్లు బిగువున బాధ భరించాలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మన సమాజంలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు.


హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారని చెప్పారు. హిందువులంతా ఏకమయ్యే సమయం అసన్నమైందన్నారు. మన మతం గురించి మాట్లాడుకోవాలంటే..భయపడే పరిస్థితికి వచ్చామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు.. ఇదంతా గతంలో మెకాలే తీసుకువచ్చిన వివక్ష అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 03 , 2024 | 08:00 PM