Share News

Tirumala: పవన్ కల్యాణ్‌కి మోకాళ్ల నొప్పి.. మెట్లపైనే విశ్రాంతి

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:21 PM

ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తిరుమలకు బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నరసింహ స్వామి దేవాలయం వద్దకు ఆయన చేరుకున్నారు.

Tirumala: పవన్ కల్యాణ్‌కి మోకాళ్ల నొప్పి.. మెట్లపైనే విశ్రాంతి

తిరుమల, అక్టోబర్ 01: ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తిరుమల బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నరసింహ స్వామి దేవాలయం వరకు చేరుకున్నారు. అయితే కాలు నొప్పి కారణంగా ఆయన మెట్లు ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కొంత సేపు మెట్ల మీదే విశ్రాంతి తీసుకున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై అంజనమ్మ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్


వేగంగా మెట్లు ఎక్కడం వల్ల పవన్‌కు తీవ్ర మోకాళ్ల నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం తెలుకున్న స్విమ్స్‌కు చెందిన ఫిజియోథెరఫిస్ట్.. పవన్ కల్యాణ్ వద్దకు బయలుదేరారు. మరో గంటలో పవన్ కల్యాణ్ తిరుమల చేరుకునే అవకాశముందని సమాచారం. ఈ రాత్రి పవన్ కల్యాణ్ తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు (బుధవారం) ఉదయం తిరుమల వెంకన్నను ఆయన దర్శించుకోనున్నారు.

Also Read: Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

Also Read: Durga Navaratri 2024: శరన్నవ రాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం


గత వైఎస్ జగన్ ప్రభుత్వ హాయంలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ సిట్ శనివారం నుంచి తన దర్యాప్తును ప్రారంభించింది. అయితే కలియుగ దైవం శ్రీవెంటేశ్వరని సన్నిధిలో తయారైన ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడంపై పవన్ కల్యాణ్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.

Also Read: West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు

Also Read: గోరింటాకు వల్ల ఇన్నీ లాభాలున్నాయా..


ఈ నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. అందులోభాగంగా విజయవాడలోకి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం మెట్లను పవన్ కల్యాణ్ స్వయంగా శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నాు. అక్కడి నుంచి అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకు ఆయన పయనమయ్యారు. రేపు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు.

Also Read: Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తలు కోసం..

Updated Date - Oct 01 , 2024 | 09:33 PM