Share News

Pawan Kalyan: నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:50 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ నేరుగా వైజాగ్ వెళ్లారు. అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకున్నారు. ఆర్భాటం లేకుండా పవన్ విశాఖ టూర్ కొనసాగుతోంది. పార్టీ నేతలను సైతం తనతో రావద్దని ఆయన సూచించారు.

Pawan Kalyan: నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ నేరుగా వైజాగ్ వెళ్లారు. అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకున్నారు. ఆర్భాటం లేకుండా పవన్ విశాఖ టూర్ కొనసాగుతోంది. పార్టీ నేతలను సైతం తనతో రావద్దని ఆయన సూచించారు. తమ పార్టీ మంచి విజయం సాధించి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో పవన్ కల్యాణ్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే.. ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 01:50 PM